మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని ఖండిస్తూ పటాన్‌చెరులో భారీ నిరసన

08-09-2026 | 09:38pm

పటాన్ చెరు: భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి(Former Corporator Sindhu Adarsh ​​Reddy) బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి  మాట్లాడుతూ... మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనిన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని పేర్కొన్నారు. మహిళల గౌరవం  ప్రజాస్వామ్యానికి గౌరవం, అన్యాయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు