5 రోజుల ముందే జీతాలు!
కేంద్ర ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె(bank strike) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు(Central Government Pension) ఈసారి సాధారణ తేదీ కంటే ముందుగానే జీతాలు, పింఛన్లు అందనున్నాయి. బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పింఛన్ల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల జీతాలు, పింఛన్లను దాదాపు ఐదు రోజుల ముందుగానే వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ముందుగానే తమ ఖాతాల్లో జమయ్యే నగదును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సేవలకు(banking services) అంతరాయం ఏర్పడే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి.. బ్యాంకుల సమ్మెకు ముందే కేంద్ర ఉద్యోగులు, పింఛనర్ల ఖాతాల్లో జీతాలు, పింఛన్లు జమ కానున్నాయి.