చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఇల్లెందు, (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి (Chityala) ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఇల్లెందు పట్టణంలోని జగదంబ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. దిండిగాల రాజేందర్ కార్యాలయంలో పట్టణ, మండల ముఖ్య నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్(Former Chairman) దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమన్నారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన ధైర్యం తెలంగాణ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అబ్దుల్ జబ్బర్, డెరంగుల పోషం, లలిత్‌కుమార్ పాసి, గడ్డి శీను, ఇమ్రాన్, తుంగ మహేష్, చాకలి సతీష్, పరకపల్లి రవి, కిషన్ ప్రసాద్ పాసి, జ్వాలా సాంబ, మునుగంటి శివ, మూలగుండ్ల ఉపేందర్‌రావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు రామ్లాల్ పాసి తదితరులు పాల్గొన్నారు.