రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

10-09-2026 | 02:19pm

హైదరాబాద్: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటమే ఐలమ్మకు(Chakali Ilamma) నిజమైన నివాళులని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజనుల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో(Ravindra Bharathi) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వి.హనుమంతరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు