కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి
ముకరంపుర, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ మట్టిలో పుట్టి, నైజాం రజాకార్ల అరాచకాలకు, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కొనియాడారు. చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma death anniversary) సందర్భంగా కరీంనగర్(Karimnagar) నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితమైంది కాదని, అది మొత్తం తెలంగాణ ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రధానంగా నేటి నారీ మణులకు, మహిళా లోకానికి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ ఆదర్శనీయం అని ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, బిజెపి నాయకులు మరియు రజక సంఘం ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు.