ప్లాస్టిక్ దుకాణాలకు జరిమానా
10-09-2026 | 04:44pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ఉన్న స్వీట్ హోమ్ లు, బేకరీలు పై తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రత ప్రమాణాలు పాటించిన వారికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) వాడిన వారికి 2500 రూపాయలు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు(Municipal Commissioner Ravi Babu) మాట్లాడుతూ... దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, దీనికి బదులుగా బట్ట సంచులు వాడాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని లేనియెడల భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.