వినాయకుడికి చల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రత్యేక పూజలు

22-09-2026 | 06:51pm

కోనరావుపేట: మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ముదిరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు(Chalmeda Lakshmi Narasimha Rao) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల్లో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు.

మరిన్ని వార్తలు