దిర్శించర్లలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

22-09-2026 | 10:09pm

నేరేడుచర్ల,సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామపంచాయతీ(Gram Panchayat) పరిధిలోని దుబ్బల మీద శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాతలు సట్టు లక్ష్మీ నారాయణ,పాతకోటి అనిల్ సహకారంతో చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా దాతలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో దిర్శించర్ల సర్పంచ్ బుర్రి శ్రీను,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోదాల వెంకట సైదులు,పంచాయతీ కార్యదర్శి మచ్చ నరసింహ,11వ వార్డు సభ్యురాలు సట్టు కృష్ణవేణి,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగపాటి సైదిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు కుర్రి శ్రీను,నన్నెపంగ శ్రీను,బుర్రి నరసింహ,షేక్ జలీల్ ఖాన్,మాగంటి జయమ్మ,పాతకోటి సునీల్,సట్టు భరత్ కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు