యూపీఐ పై చార్జీలు ఉపసంహరించుకోవాలి
సిపిఐ ఆధ్వర్యంలో బ్యానర్ పై సంతకాల సేకరణ
నేరేడుచర్ల,సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): కేంద్రoలోని బిజెపి ప్రభుత్వ(BJP government) ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు రోడ్లమీదకి రావాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) యుపిఐ విధించిన చార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు(CPI State Committee member Dhulipala Dhanunjaya Naidu) అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లోన సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
బిజెపి అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని,విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, ధరలను నియంత్రిస్తామని పదేపదే ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చి,గడచిన 12 సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్,సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపారని, అచ్చే దిన్ పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకోవడం ప్రారంభించారని
క్యాష్ కి స్వస్తి పలికి ప్రజలందరూ డిజిటల్ చెల్లింపుల ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగించాలని పెద్ద ఎత్తున భారీ కటౌట్లతో మీడియాలో ప్రకటనల ద్వారా ప్రజలను అటువైపు నెట్టారని,యూపీఐ చెల్లింపుల ద్వారా ఎటువంటి చార్జీలు విధించమని ఆనాడు తెలిపి ఒక ప్రణాళిక బద్ధంగానే ముందు ఉచితంగానే సేవలు అందిస్తామని ఆ తర్వాత విపరీతమైన చార్జీలు వసూలు చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని
ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం యూపీఐ పై చార్జీలు విధిస్తామని ఇది సామాన్య ప్రజలకు ఏ రకమైన నష్టం కాదని తెలుపుతున్నారు.కానీ ఏ వ్యాపారస్తుడు తమ లాభాలను వదులుకోడు, నేడు ఉన్నటువంటి అన్ని వస్తువుల ధరలను పెంచి వినియోగదారులకు అమ్ముతారు. ఇది ప్రత్యక్షంగా ప్రజలపై భారమే. ఇప్పటికే జీఎస్టీ ద్వారా అనేక వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దోపిడి శక్తుల సంపాదనపై టాక్సీలు పెంచకుండా వారికి మరింత సహకరించే విధంగా బ్యాంకులలో వారు పొందినటువంటి రుణాలను మాఫీ చేస్తూ కార్పొరేట్ వర్గాల కొమ్ముకాస్తున్నాడని
యూపీఐ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించి నడిపిస్తున్నదని ఇవ్వాళ ఏమీ అవసరం వచ్చిందని యూపీఐ పై చార్జీలు విధిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం తెలిపాలని ప్రశ్నించారు.మత రాజకీయాల మాటున ఎక్కువకాలం బిజెపి దాక్కో లేదని ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం మెడలు వంచి ఐక్య ఉద్యమాల ద్వారా హక్కుల సాధనకు నడుంబించాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న బత్తిని శ్రీనివాస్ గౌడ్, వజ్రపు వెంకటేశ్వర్లు బండి శ్రీనివాస్ బి సైదా నన్నేపంగ నగేష్ బెల్లంకొండ గణేష్ మాధవరెడ్డి మైక్ వెంకన్న పాల్గొన్నారు.