పండుగ శోభ.. కళకళలాడుతున్న వీధులు

13-09-2026 | 05:41pm

​చేగుంట, సెప్టెంబర్ 13:(విజయక్రాంతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చేగుంట పట్టణ(Chegunta town) కేంద్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. స్థానిక గాంధీ చౌరస్తా, ప్రధాన రహదారి వెంట వినాయక వ్రత పూజా సామగ్రి, ఏకవింశతి పత్రాలు (పూజా ఆకులు), గరిక, తాజా బంతి, చామంతి పూలు, సీతాఫలాలు, వెలగపండ్లు, మామిడి తోరణాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళలు, చిరువ్యాపారులు రోడ్డు పక్కనే దుకాణాలు ఏర్పాటు చేయగా, చేగుంటతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా వస్తువులను కొనుగోలు చేస్తుండటంతో ప్రధాన కూడలి అంతా పండుగ సందడితో కిటకిటలాడుతోంది.

మరిన్ని వార్తలు