భూమి పోయే... బతుకు ఆగమాయే!
పట్టణ విస్తరణ వేళ విలవిల లాడుతున్న చేవెళ్ల రైతాంగం
విద్యా వ్యాపారులు, దళారుల మాయాజాలంలో చిక్కి కోట్ల రూపాయల విలువైన భూములు కోల్పోయిన రైతులు
రెవెన్యూ నియోజకవర్గంలో రెవెన్యూ సరిదిద్దు బాటు క్యాంపులు చేపట్టాలి
చేవెళ్ల, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): నగరం విస్తరిస్తోంది... మన భూములకు రెక్క లొచ్చాయి‘ అని సంబరపడేలోపే చేవెళ్ల రైతులకు(Chevella farmers) ఊహించని కోలుకోలేని దెబ్బ తగిలింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న తల్లి లాంటి భూమి చేజారిపోయి, చేతిలో చి ల్లిగవ్వ లేక, రేపటి గురించిన ధీమా కరువై ఇక్కడి రైతాంగం విలవిలలాడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) మహానగరానికి స మీపంలో ఉందన్న ఒకే ఒక్క కారణం వారి పాలిట శాపమైంది.ముందుచూపు లేక, చట్టాలపై అవగాహన లేక అమాయక రైతులు తమ విలువైన స్థిరాస్తులను అమ్ముకొని, నే డు కన్నీళ్ల పాలవుతున్నారు.
చదువు పేరిట చాపకింద నీరులా దోపిడీ....
2004 తర్వాత భూముల ధరలు ఒక్కసారిగా పుంజుకోవడంతో 2005-2010 కాలం లో విద్యా వ్యాపారులు చేవెళ్లపై పడ్డారు. ఇం జనీరింగ్ కాలేజీకి 25 ఎకరాలు ఉండాలన్న నిబంధనను చూపి రైతుల నుంచి ఎకరాల కు ఎకరాలు తక్కువ ధరకే గుంజేశారు. కే వలం ’ఫీజు రీయింబర్స్మెంట్’(Fee reimbursement) సొమ్మును దండుకోవడానికే వెలసిన ఈ కాలేజీలు, ఆ తర్వాత నాణ్యత లేక మూతపడ్డాయి. రైతుల పొలాలను లాక్కుని కట్టిన విద్యా సంస్థలు, కాలక్రమేణా కోళ్ల ఫారాలుగా మారడం ఇక్క డి రైతుల గుండెలను పిండేస్తోంది.
భూ వివాదాల(Land disputes) సుడిగుండంలో... బ్రోకర్ల పండుగ....
సర్వే నంబర్లు, కౌలు (టెనెన్సీ) రికార్డులపై రైతులకు సరియైన అవగాహన లేకపోవడాన్ని దళారులు ఆసరాగా చేసుకున్నారు. కా గితాలపై రికార్డు ఉండి భౌతికంగా భూమి లే కపోవడం, ఒకరి పేరిట పట్టా ఉంటే మరొకరి పేరిట టెనెన్సీ ఉండటంతో అన్నద మ్ముల మధ్య, పొరుగు రైతుల మధ్య తగాదాలు రాజేశారు. సామరస్యంగా ముగియా ల్సిన చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపి ’పంచాయతీలు’ పెట్టారు.భయపెట్టి, ఆశ చూపి తెల్ల కాగితాలపై వేలిముద్రలు చే యించుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారు.ఆ డబ్బుతో బ్రోకర్లు తరతరాలకు స రిపడా సంపాదించుకుని నగరాల్లో స్థిరపడ గా, రైతులు మాత్రం అగ్రిమెంట్ల సొమ్ము రా క, కోర్టుల చుట్టూ తిరుగుతూ లబోదిబోమంటున్నారు.
సర్కారు ఖజానా నిండుతున్నా... రైతు కడుపు నిండేది ఎప్పుడు?
చేవెళ్ల ప్రాంతం నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆర్థిక వనరుగా మా రింది. రెవెన్యూ శాఖకు అత్యధిక రాబడి అం దిస్తుండటంతో పాటు, ఇటీవల మున్సిపాలిటీగా మారిన చేవెళ్ల రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. కానీ, ప్రభుత్వ ఖజానాను నింపుతున్న ఈ మట్టి మనుషుల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండడం లేదు.
స్థానికులడిమాండ్....
ప్రభుత్వం తక్షణమే స్పందించి చేవెళ్ల నియోజకవర్గంలో ప్రత్యేక రెవెన్యూ సరిదిద్దుబాటు క్యాంపులు నిర్వహించాలి. ఇనామ్, టెనెన్సీ మరియు రికార్డుల లోపాల వల్ల నష్టపోయిన పేద రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతాంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.