7 September, 2026 | 11:10 AM

9న ఇందిరా పార్క్ ఎదుట ధర్నా

07-09-2026 | 09:29am

బెల్లంపల్లి,( విజయ క్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడి(Anganwadi) ఉద్యోగులకు 18వేలు వేతనం నిర్ణయించాలనీ, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలనీ ఈనెల తొమ్మిదిన ఇంద్ర పార్క్(Indra Park) ఎదుట ధర్నా చేస్తున్నట్లు సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్  తెలిపారు. తాండూర్ మండల అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి  అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడారు.ప్రీ. పైమరీ, పీఎంశ్రీ మొత్తం 4,131 కేంద్రాలను తక్షణమే రద్దు చేసి, ఈ కేంద్రాలను అంగవ్వాడీలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలనీ డిమాండ్ చేశారు.

ఐసిడిఎస్ కు నిధులు పెంచి, బలోపేతం చేయాలినీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ. 18,000/- ల వేతనం వెంటనే నిర్ణయించాలన్నారు. ఈపీఫ్ సాకర్యం కల్పించాలనీ, టీచర్స్, హెల్పర్స్ మొత్తం రూ. 15 వేల ఖాళీ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలిన్నారు. BLO పెండింగ్ డబ్బులు, SIR డ్యూటీ అమౌంట్ వెంటనే చెల్లించాలనీ కోరారు. పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ ఏరియర్స్, హెల్సర్ నుండి టీచర్ గా ప్రమోట్ అయిన వారికి పెండింగ్ పరియర్స్, PRC పరియర్స్, 24 రోజుల సమ్మె వేతనాలు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు.

సమావేశంలో దాగం రాజారాం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి, దాగం రాజారాం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) జిల్లా అధ్యక్షురాలు భానుమతి, జిల్లా నాయకులు విరోనిక, సత్యవతి, లీలారాణి, సుజాత విజయలక్ష్మి ప్రమీల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు