రుణమాఫీలో సీఎం రేవంత్ విఫలం
మోసపూరిత మాటలతో దగా చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే సురేందర్
తాడ్వాయి, సెప్టెంబర్, 6 (విజయక్రాం తి): రైతుల రుణాలు రూ. 2 లక్షలు మాఫీ చేస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతుల గు ణాలు మాఫీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జా జాల సురేందర్ (Former MLA from Yella Reddy, Ja Jala Surender) తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి రై తు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు.420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసి రైతులను కా ంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందని చె ప్పి కొందరు రైతుల రుణాలు మాఫీ చేసి డంబాచారాలు కొట్టుకుంటున్నారని తెలిపారు. కొందరి రైతుల రుణాలు మాకు చేసి మేము రుణమాఫీ చేశామని ప్రగల్బాలు ప లుకుతున్నారని ఎద్దేవా చేశారు.
వెయ్యి రో జుల పాలల్లో రేవంత్ సర్కార్ చేసింది ఏమీ లేదని తెలిపారు. కౌలు రైతులకు రూ.15 వే లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను మరిచిపోయిందన్నారు.రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్ర భుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నా రు.
కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలు అమలుచేసి అందరిని ఆదుకుంటామని నమ్మబ లికారని ప్రస్తుతం ఆ హామీలను పూర్తిగా మ ర్చిపోయారన్నారు. తాడ్వాయిలో యూరి యా కొరత తీవ్రంగా ఉందని, దీనిపై బిఆర్‌ఎస్ ఆందోళన చేస్తామంటే పోలీసులను పెట్టి ఆందోళన జరగకుండా నివారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు నర్సింలు, సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి, నాయకులు సాయి రెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






