కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశం.. సీఎం సంచలన ప్రకటన

16-09-2026 | 03:52pm

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) 22A నిషేధిత భూముల అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)కు సీఎం రేవంత్ షాకిచ్చారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. కేసీఆర్ ఫామ్ హౌస్(KCR farmhouse)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని సూచించారు.

సిద్ధిపేటలో కేసీఆర్ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉందని తెలిపారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఫామ్ హౌస్ లో 295 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఎవరెవరికి ఎంత భూమి ఉందన్న అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు,కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినిపల్లి సంతోష్ రావు 79 ఎకరాలు, నవీన్ రావుకు 52 ఎకరాలు కొడంగల్ లో 48 ఎకరాలు, కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాలోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాల భూమి ఉందని ముఖ్యమంత్రి లెక్కచెప్పారు.

మరిన్ని వార్తలు