ఇద్దరు నిందితులు అరెస్ట్
బెజ్జూర్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామ శివారులో వ్యవసాయ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ పోల్స్ ధ్వంసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విజయ్(SI Vijay) తెలిపారు. మర్తిడి గ్రామ శివారులోని సర్వే నం.167/2, 167/3, 167/4లో ఉన్న భూమికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లో సుమారు 50 పోల్స్‌ను ధ్వంసం చేసినట్లు గజ్జల సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో A1 మెరుగు భిక్షపతి గౌడ్, A2 మహ్మద్ ఇషాక్‌లు నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
గతంలో ఇదే భూమికి సంబంధించి కోర్టు వివాదం ఉండగా, సంబంధిత కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిందితులు భూమిలోకి ప్రవేశించరాదని అఫిడవిట్/హామీ ఇచ్చినప్పటికీ, దానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు A1 మెరుగు భిక్షపతి గౌడ్‌ను, A2 మహ్మద్ ఇషాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ చట్ట ప్రకారం అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరు పరచగా గౌరవ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు