కూసుమంచి శివాలయం హుండీ ఆదాయం 61,895

16-09-2026 | 05:00pm

కూసుమంచి, (విజయక్రాంతి): కూసుమంచి గ్రామంలోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి(Sri Ramalingeswara Swamy) దేవస్థానం ఆవరణ నందు బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ ఆదాయం రూ.61,895 వచ్చింది‌.

దేవాలయ ఈఓ కాముని శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి వేణుగోపాల చార్యులు, అర్చకులు దేవులపల్లి అభి రామ్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ పి. రాందాసు కూసుమంచి గ్రామ భక్తులు వైస్ ప్రెసిడెంట్ చెన్ను వెంకటరమణ, కొండ మైపాల్, ఆలయ మాజీ చైర్మన్ రేల ప్రదీప్ రెడ్డి, వార్డ్ మెంబర్ అంతటి వెంకన్న, చంద్రయ్య, కె వీరబాబు తదితరులు  హుండీ లెక్కింపు  కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయం అవరణంలో దుకాణాలు నిర్వహించుకునేందుకు వేలం పాటను నిర్వహించారు. ఆలయం మంచి ఆదాయం లభించినట్లు ఆలయం ఈఓ శ్రీకాంత్ తెలిపారు.

మరిన్ని వార్తలు