విద్యాశాఖలో అనేక మార్పులు తెస్తున్నాం
- సర్వేపల్లి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
- ఉపాధ్యాయులు ధర్నా చేస్తే బాధ కలిగింది
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటిస్తున్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College) ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ ఫోటో దిగారు. కొడంగల్ లో ఉత్తమ ఉపాధ్యాయులను(Best teachers) ముఖ్యమంత్రి సత్కరించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.... ఉపాధ్యాయులపై నమ్మకంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు. సాంకేతిక విద్యకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని హామీ ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) గురించి అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు. తల్లిదండ్రులతో పాటు సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులే అని కొనియాడారు. పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోని ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుందని తెలిపారు. తెలంగాణలో 88 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే ఉన్నారని వెల్లడించారు. విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని సూచించారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే(Government school) చదువుకున్నానని పేర్కొన్నారు. ఇటీవల ఇందిరాపార్క్ దగ్గర ఉపాధ్యాయులు ధర్నా(Teachers' strike) చేస్తే బాధ కలిగిందని సూచించారు. చాలా కాలం పెండింగ్ లో ఉన్న పదోన్నతులను తాను పూర్తిచేశానని చెప్పొకొచ్చారు. టీచర్ల బదిలీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నానని తెలిపారు. 315 జీవో ద్వారా చాలా సమస్యలు పరిష్కరించామన్నారు. విద్యాశాఖ కమిషన్(Education Department Commission) ద్వారా చాలా సమస్యలు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో ఒకే కుటుంబం 7.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. తాను బాధ్యత తీసుకున్న తర్వాత 55 రోజుల్లోనే 10 వేల మంది టీచర్లను అందించామన్నారు. తెలంగాణ పితామహుడు కేకే(Father of Telangana KK) కమిటీ ద్వారా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. ప్రతినెల ఒకటో తారీఖు రోజే జీతం అందిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్(Congress government) వచ్చిన వెంటనే పీఆర్సీ సమస్య కూడా పరిష్కారించామన్నారు. విదేశాల్లో ఉన్న విద్యావిధానాన్ని పరిశీలించాలని టీచర్లను విదేశాలను పంపామన్నారు. ఉపాధ్యాయుల సేవలను తక్కువ చేసి చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సీఎం తేల్చిచెప్పారు.






