16 August, 2026 | 2:27 PM

Districts - Vikarabad

article_33910044.webp
మాజీ ప్రధాని వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం

తాండూరు, ఆగస్టు 16, (విజయకాంతి): భారతరత్న, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ జిల్లా తాండూర్ బిజెపి నాయకులు అన్నారు. ఆదివారం వాజ్ పేయి 8 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పట్టణ శాఖ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ నాగారం మల్లేశం మాట్లాడుతూ అగ్ర రాజ్యాల ఆదిపత్యాన్ని ఎదురొడ్డి పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారత్ అంటే ఏంటో చూపించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, నాయకుడు బంటారం భద్రేశ్వర్, దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, బండారు శ్రీకాంత్, మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, కృష్ణ పటేల్, చందు, బబ్లు, సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

16-08-2026

article_78847816.webp
తాండూరులో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ

తాండూరు, ఆగస్టు 14,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. తిరంగా యాత్ర అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను చేతబట్టి భారీ సంఖ్యలో సంఖ్యలో ప్రజలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని మువ్వన్నెల జెండాను గౌరవిస్తూ భారత్ మాతాకీ జై... వందేమాతరం.. తదితర దేశభక్తి నినాదాలు చేస్తూ దేశభక్తి ఉట్టిపడేలా పురవీధుల గుండా ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలు వురు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, యువకులు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన దేశభక్తులను, వారి త్యాగాలను గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

14-08-2026