సీఎం రేవంత్‌కు అవార్డు

25-09-2026 | 07:16pm

నిలంబూర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేరళలోని నిలంబూర్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందింది. దివంగత కేరళ నేత ఆర్యదాన్ మహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘ఆర్యదాన్ మహమ్మద్–2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు, నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అవార్డులో రూ.1 లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఉన్నాయి. నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్యదాన్ మహమ్మద్ స్మారక ఉపన్యాసాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందించారు.

మరిన్ని వార్తలు