దళితుల అవమానంపై సీఎం సీరియస్‌.. సమగ్ర విచారణకు ఆదేశం

09-09-2026 | 05:24pm

హైదరాబాద్‌: దళితులను అవమానించిన ఘటనలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. అంటరానితనం ప్రదర్శించిన వారిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. విచారణ అధికారిగా విజయ్‌కుమార్‌ను నియమించారు. అసెంబ్లీ వద్ద జరిగిన అంగప్రదర్శన, పోలీసులు, మహిళలను ఇబ్బంది పెట్టిన ఘటనలపైనా విచారణ చేపడతామన్నారు. అలాగే డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడుల వివరాలు సేకరిస్తామని, కుట్రధారులు, పాత్రధారులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు