తాతా మధు కామెంట్స్‌పై సీఎం రియాక్షన్

07-09-2026 | 02:52pm

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7: స్పీకర్‌పై తాతా మధు(Tata Madhu) చేసిన వ్యాఖ్యల విషయంలో అసెంబ్లీ(Assembly)లో దుమారం రేగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.  సభలో సభ్యులకు ఏం జరిగినా వారిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాంటి స్పీకర్‌కే అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతిపై సభ్య సమాజం సహించలేని విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌పై వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన సీఎం.. ఇది సభ్య సమాజం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు