ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్‌

10-09-2026 | 01:54pm

కోరుట్ల, సెప్టెంబర్‌ 10(విజయక్రాంతి): కోరుట్ల పట్టణంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Comprehensive Revision) ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ పరిశీలించారు. ఓటర్ల పేర్లు, ఇంటిపేర్లు, ఫొటోల్లో తప్పులను నిబంధనల ప్రకారం సరిచేయాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు(SIR process) విచారణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించిన కలెక్టర్‌, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు