కార్మికులు, పేదల సంక్షేమానికి వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): కార్మికులు, పేదల సంక్షేమానికి మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అన్నారు. సోమవారం ఐడీఓసీలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జి. వెంకటస్వామి జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజనీతిజ్ఞుడిగా, ప్రజా నాయకుడిగా వెంకటస్వామి అందించిన సేవలు ఆదర్శనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధితో పాటు కార్మికులు, పేదల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, యువజన, క్రీడల శాఖ అధికారి రఘు, డీఆర్వో వసంత, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.