సీనియర్ల వ్యూహాలే నా బలం
వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదు
భారత స్పిన్నర్ శ్రీ చరణి వ్యాఖ్యలు
దుబాయి, సెప్టెంబర్ 6: పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకు న్న తర్వాత భారత స్టార్ స్పిన్నర్, తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి(Sri Charani) తన సంచలన ప్రదర్శన వెనుక ఉన్న వ్యూహాలను పంచుకుంది.
మ్యాచ్‌కు ముందు జట్టులోని స్పిన్నర్ల ప్లానింగ్ గురించి శ్రీచరణి చెబుతూ మీటింగ్‌లో ముగ్గురం నేను, ప్రేమా, దీప్తి, రాధా కలిసి కూర్చుంటాం. ఏం చేయాలో చర్చించుకుంటాం. దీప్తి, రాధాలు చెప్పిన వాటిని మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని సీనియర్ల ప్రాధాన్యతను వివరించింది. తన వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుతూ నా విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నేను నా పనులను సరిగ్గా చేయాలనుకుంటున్నాను అని తెలిపింది.
పిచ్‌ను పరిశీలించిన తర్వాత అది స్పిన్‌కు అనుకూలిస్తుందని గ్రహించి, ఎక్స్‌ట్రాలు ప్రయత్నించకుండా కేవలం స్టంప్స్ టు స్టంప్స్ బౌలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన తోటి స్పిన్నర్ ప్రేమా రావత్‌పై శ్రీచరణి ప్రశంసలు కురిపించింది. ప్రేమా అద్భుతమైన సహజ సిద్ధమైన ప్రతిభ కలిగిన ఆటను ప్రదర్శిస్తుందని, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నింటిలోనూ ఆమె రాణించగలదని పేర్కొంది.






