డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలి
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality)లోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(Double bedroom houses)ల్లో సమగ్ర విచారణ చేపట్టి న్యాయమైన వారికి ఆన్లైన్(Online) పట్టాలు చేయాలని శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. వినతిపత్రం స్థానిక తహశీల్దార్ సుజాత రెడ్డి(Tahsildar Sujatha Reddy)కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, బీసీపీ జిల్లా కార్యదర్శి పశుల వెంకన్న ,ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, స్వరూప లు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అనర్హులు చాలామంది ఉన్నారని ,కాగా గతంలో అధికారులు విచారణ చేపట్టినప్పటికీ ఇంకా చాలామంది అనర్హులు ఆక్రమణలో ఉన్నారని వారిని తొలగించి నిజమైన అర్హులకు మాత్రమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.






