కేసీఆర్ రాజీనామా చేయాలి!
అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి
ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా!
హైదరాబాద్: వెయ్యి రోజులుగా ఎమ్మెల్యే జీతం తీసుకుంటూ… ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతుకగా నిలవకుండా, అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్న గజ్వేల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్(Congress dharna) ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్(KCR) అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేసీఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ.. ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






