ప్రజాపాలన అందించడంలో కాంగ్రెస్ విఫలం
మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్
బాన్సువాడ, సెప్టెంబర్ 6 (విజయ క్రా ంతి): రాష్ట్రంలో ప్రజాపాలన అందించడ ంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Former BRS MLA Baji Reddy Govardhan) విమర్శించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రం లో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పా ర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమరభేరి’, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యంపై నిరసన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి గ్రామంలోని ము రుగునీటి కాలువలు, శిథిలావస్థకు చేరిన గ్రా మపంచాయతీ భవనం, నర్సరీని పరిశీలించారు. నసురుల్లాబాద్‌లోని గ్రామపంచాయ తీ భవనం ప్రమాదకర స్థితికి చేరిందని బాజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో పంచాయతీ సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సిబ్బం ది ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మౌలి క వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని బాజిరెడ్డి అన్నారు.
వైకుంఠధామాలు, నర్సరీలు, మొక్కల పెంపకం, మురుగునీటి కాలువలు, రోడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు నర్సింలు గౌడ్, సాయిలు, భాస్కర్ అక్తర్, కృష్ణ, భూమయ్య, రాము, బాబు, శేఖర్, నాగరాజు, గోపిరెడ్డి, కిషన్, నవీన్, రవి , బాలకృష్ణ, సంజీవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






