సర్ ప్రోగ్రాంను వెంటనే రద్దు చేయాలి
టిపిసిసి మాజీ జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా
హుజూర్ నగర్, అక్టోబర్ 5: కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సర్ ప్రోగ్రాంను వెంటనే రద్దు చేయాలని టిపిసిసి మాజీ జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా(TPCC former joint secretary MD Aziz Pasha), బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ అన్నారు. సోమవారం పట్టణంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు... కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం సిఇసి జ్ఞానేశ్ కుమార్ ని అడ్డం పెట్టుకొని ఓట్ చోరీ చేస్తూ అడ్డదారిలో బిజెపి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్టు జడ్జీలు సైతం కొన్ని వర్గాల ఓట్లను తొలగించడం తీవ్ర తప్పిదమని తెలిపారని, వ్యక్తి చనిపోతే తప్ప ఓటును డిలీట్ చేయటం మరి ఏ ఇతర కారణం చేతనైనా మన దేశంలో పౌరులందరికీ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిందని ఓటును తొలగించడానికి ఎవరికి హక్కు లేదని తెలిపారని కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు.
ఓటు చోరీ చేస్తున్న సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలన్నారు.రాహుల్ గాంధీ గారు గత రెండు సంవత్సరాలుగా ఓట్ల చోరీతో బిజెపి అధికారంలోకి వస్తున్నాయని పలు సందర్భాలలో దేశవ్యాప్తంగా బహిర్గతం చేశారని, ఎన్నికలు సక్రమంగా జరగట్లేదని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఏ అబ్దుల్ మజీద్ భాయ్,కోల మట్టయ్య, ఎస్.కె బిక్కన్ సాహెబ్,పోతబోయిన రామ్మూర్తి, లచ్చిమల్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.