కాంగ్రెస్ పార్టీ సంబరాలు
13-09-2026 | 05:01pm
నిర్మల్ సెప్టెంబర్ 13 ( విజయ క్రాంతి): లక్ష్మణ చందా మండలంలోని వడ్డాల్(Vaddal) గ్రామంలో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆదివారం మండల కన్వీనర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో డబ్బులు లేని రోడ్డు నిర్మించాలని తమ విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించి 10.80 కోట్ల నిధులను మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.