ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

05-10-2026 | 08:51pm

బతుకమ్మ, దసరా వేడుకల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి

ఘట్ కేసర్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మన తెలంగాణ రాష్ట్ర పండుగలైన బతుకమ్మ, దసరా వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్(Congress) పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి(Ghatkesar Deputy Commissioner Vani)కి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రధాన కూడళ్లు, దేవాలయ ప్రాంగణాలు, గురుకుల్ గ్రౌండ్, బహిరంగ మైదానాలు, చెరువుల వద్దకు వేలాది మంది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ(Batukamma) ఆడుకోవడం, నిమజ్జనం చేయడం అలాగే దసరా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.

కావున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలు జరిగే అన్ని ప్రాంతాల్లో ముళ్లపొదలను తొలగించి, మైదానాలను చదును చేసి, పారిశుధ్య పనులు, పూల వ్యర్థాల తొలగింపు, దోమల నివారణకు పాగ్గింగ్ పనులను వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే రాత్రి సమయాల్లో మహిళల భద్రత దృష్ట్యా వేడుకలు జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారులలో వెలగని వీది దీపాలకు మరమ్మతులు చేపట్టి, అదనపు లైట్లను, మైక్ సెట్ లను ఏర్పాటు చేయాలని సర్కిల్ డీసీ కి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శులు మీసాల సుధాకర్ రావు, మొల్గురం రామస్వామి, నాయకులు కొంతం అంజిరెడ్డి, సిహెచ్. మచ్చందర్ రెడ్డి, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు