ట్రంప్ దూకుడుకు కోర్టు కళ్లెం

25-09-2026 | 05:15am

మీడియా సంస్థలపై బ్యాన్ ఎత్తివేత

14 రోజులపాటు నిషేధంపై తాత్కాలిక స్టే

తీర్పునిచ్చిన యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తిమోతి కెల్లీ

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Donald Trump) చర్యలకు, దూకుడుకు యూఎస్ ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వే సింది. మూడు మీడియా సంస్థలపై నిషేధం విధించిన ఆయన నిర్ణయానికి బ్రేక్ వేసింది. 18న వైట్‌హౌస్‌లో ప్రవేశంపై ప్రముఖ మీడియా సంస్థలైన సీఎన్‌ఎన్, ఎంస్ నౌ, పొలిటికోలపై సెప్టెంబర్ 18 నుంచి నిషేధం విధించారు.

ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మీడియా సంస్థలు యూఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం విచారణ సందర్భంగా ఈ సంస్థల వాదనలను విన్న న్యాయమూర్తి తిమోతి కెల్లీ విధించిన నిషేధంపై 14 రోజులపాటు తాత్కాలిక స్టే విధించారు. దీంతో  మూడు సంస్థలు వైట్‌హౌస్‌లో ప్రసారాలకు ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది. అమెరికా రహాస్య సమాచారాన్ని ఈ సంస్థలు లీక్ చేశాయని అందుకే వీటిపై వైట్ హౌస్ నిషేధం విధించిందని ట్రంప్ ఇటీవల సమర్థించుకున్నారు.

ఈ సంస్థలు దురుద్దేశ్యపూర్వకంగానే తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నాయని కూడా ఆరోపించడం గమనార్హం. ఇంతకీ ట్రంప్ పేర్కొన్న సున్నిత సమాచారం ఏమై ఉంటుందా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మూడు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. వైట్ హౌస్ కింద బంకర్, ఇరాన్‌తో యుద్ధం సందర్భంగా అమెరికా వద్ద ఆయుధాల కొరత, వైట్‌హౌస్ బాల్ రూమ్‌లో నిధులు అనే వార్తలపై విశ్లేషణలను ప్రచురించాయి.

మరిన్ని వార్తలు