ఆదమరిస్తే అంతే..! ప్రమాదకరంగా మూలమలుపు వద్ద విరిగి డ్రైనేజీ స్లాబు
నేరేడుచర్ల,సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): మిర్యాలగూడ - హుజూర్నగర్ జాతీయ రహదారి నుండి శివాలయం ఎదురుగా జాన్ పహాడ్(John Pahad) వైపు వెళ్లే బైపాస్ రోడ్డు మూల మలుపు వద్ద డ్రైనేజీ పై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబ్ విరిగి డ్రైనేజీలో పడి ప్రమాదకరంగా ఉంది. ఏ మాత్రo ఏమర పాటుగా ఉన్న వాహనాలు అదుపతప్పి డ్రైనేజీలో పడే ప్రమాదం పొంచివుంది. సుమారు 3 నెలల క్రితం స్లాబ్ సగానికి విరిగి ప్రమాదకరంగా ఉన్నది.
దానిని తొలగించి వేరేది ఏర్పాటు చేయాలని పలు వార్త పత్రికలలో వార్తలు ప్రచురించినా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు స్లాబు పూర్తిగా విరిగి పడిపోయింది.ఏదైనా ప్రమాదం జరిగితేనె సంబందిత శాఖా అధికారులు స్పందిస్తారేమో అని వాహనదారులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా విరిగిన కాంక్రీట్ స్లాబ్ తొలగించి, వేరేది అమర్చి జరగబోవు ప్రమాదాలని నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.