జాతరకు ముహూర్తం ఫిక్స్!
27-09-2026 | 05:49pm
వనదేవతల కొలువైన మేడారంలో వచ్చే ఏడాది మినీ జాతర సందడి మొదలుకానుంది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జాతర నిర్వహించనున్నట్లు సమ్మక్క, సారలమ్మ(Sammakka, Saralamma) పూజారులు ప్రకటించారు. 17న సారలమ్మ, 18న సమ్మక్కకు పూజలు జరగనున్నాయి. 19న భక్తులు మొక్కులు చెల్లించుకోగా.. 20న జాతర ముగియనుంది. మేడారం మరోసారి భక్తజన సందడితో కళకళలాడనుంది.