175 రోజుల షూటింగ్.. 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్
నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ (Swayambhu) సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం (Directer Bharat Krishnamachari) వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రం పాన్ ఇండియాగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఫైనల్ ప్రొడక్టులో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నెంబర్స్ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోందో, ఎంత భారీ టెక్నికల్ వర్క్ జరుగుతోందో తెలియజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నిఖిల్ ఇంటెన్స్ వారియర్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించారు.
త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా వెల్లడించారు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: కేకే సెంథిల్ కుమార్; సంగీతం: రవి బస్రూర్; లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి; యాక్షన్: కింగ్ సోలోమన్, స్టంట్ సిల్వా; డైలాగ్స్: విజయ్ కామిశెట్టి; ఎడిటర్: తమ్మిరాజు; ప్రొడక్షన్ డిజైనర్స్: ఎం ప్రభాహరన్, రవీందర్.