పీసీసీ అధ్యక్షుని సన్మానించిన డిసిసి అధ్యక్షులు
22-09-2026 | 06:49pm
కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వక సన్మానించారు. రెండు సంవత్సరాలు పిసిసి అధ్యక్షునిగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తెలిపారు.