వంట మనిషి మృతితో పాఠశాలలో విషాదం
24-09-2026 | 07:46pm
భీమిని, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు శీలపెళ్లి లచ్చమ్మ(55) గురువారం వంట చేస్తూ ఒక్కసారి గా కుప్పకూలింది. ఉపాధ్యాయులు సీపీఆర్ చేసి కాపాడటానికి ప్రయత్నించడంతో పాటు 108కి సమాచారం అందించారు. పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే లచ్చమ్మ మృతి చెందినట్లు తెలిపారు. లచ్చమ్మ మృతితో పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.