వినాయకుని నిమజ్జనంలో తీవ్ర విషాదం

16-09-2026 | 11:48pm

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నీలం మధు 

ఆసుపత్రిలో మృతదేహాలకు నివాళి

పటాన్ చెరు, సెప్టెంబర్ 16: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతిచెందడం అత్యంత విషాదకర ఘటన అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పరిధిలోని నేరేడుచెరువులో జరిగిన గణేశ్ నిమజ్జనంలో విషాదకర సంఘటన జరిగింది. శిరీష చారిటబుల్‌ ట్రస్ట్ కి చెందిన ఆరుగురు విద్యార్థులు గణేశ్ నిమజ్జనం కోసం చెరువులోకి దిగి మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థులు శ్యామ్‌ కుమార్, గణేశ్, నర్సింహరాజు, సుమంత్‌, ఉదయ్‌ కిరణ్‌, సిద్దార్థ్‌ గా చెప్తున్నారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేసిన నీలం మధు వెంటనే మృతదేహాలు ఉన్న పటాన్ చెరు గ్లోబల్ హాస్పిటల్ కి చేరుకుని విద్యార్థుల మృతదేహాలకు నివాళి అర్పించారు, సంఘటన జరిగిన తీరుపై పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుంది అని ఆయన తెలిపారు., పోస్టుమార్టంలో మరియు శవాల తరలింపుపై అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని, దీనికి సంబంధించి పోలీస్ వారు పనిచేస్తున్నట్టు నీలం తెలిపారు.

మరిన్ని వార్తలు