రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు ఎన్నిక

23-09-2026 | 06:39pm

బెజ్జంకి: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రజక సంఘం(Rajaka Sangam) సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బెజ్జంకి మండలం(Bejjanki Mandal) దాచారం గ్రామానికి చెందిన దీటి రాజు ఎన్నికయ్యారు. తనను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్యలకు దీటి రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన నాయకత్వానికి, సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రజక సంఘ సభ్యులను ఐక్యం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానాని తెలిపారు. రజక జాతి ఐక్యతే బలం.. రజక జాతి అభివృద్ధే లక్ష్యం అని అన్నారు.

మరిన్ని వార్తలు