దిల్ బహార్ మసాలా కంపెనీపై పోలీసుల దాడి

23-09-2026 | 08:00pm

మసాలా ఉత్పత్తులకు సంబంధించి 2 వేల యూనిట్లు సీజ్

ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, ఎస్ఓటి టీమ్‌తో కలిసి బుధవారం అన్నోజిగూడలోని దిల్‌బహార్ మసాలా కంపెనీ(Dil Bahar Masala Company)పై దాడి నిర్వహించినట్లు, ఈదాడిలో గడువు ముగిసిన దిల్‌బహార్ మసాలా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోచారం సీఐ జగన్నాథ్ తెలిపారు. దిల్‌బహార్ మటన్ బిర్యానీ మసాలా, దిల్‌బహార్ డ్రై మ్యాంగో, దిల్‌బహార్ సబ్జీ మసాలా, దిల్‌బహార్ చికెన్ మసాలా, దిల్‌బహార్ మీట్ మసాలా, దిల్‌బహార్ ఫిష్, చికెన్, బిర్యానీ, తందూరీ చికెన్, సాంబార్ మసాలాను ఈ ఆపరేషన్‌లో ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిన వివిధ రకాల ఆహార మసాలా ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 2,000 యూనిట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ స్వాధీనానికి సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నామని, ఈ కేసుకు సంబంధించి వర్తించే చట్టాలు, ఆహార భద్రతా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు