కస్తూర్బా పాఠశాలలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ శిబిరం
వెంకటాపూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని జవహర్‌నగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(Kasturba Gandhi Girls School)లో బుధవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించగా, 14 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు గల 80 మంది బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా డా.శ్రీకాంత్ మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వైరస్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణమని, యుక్త వయసులోనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
అనంతరం డా.నాగ అనేష్ మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ సురక్షితమైనదని, క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని, తల్లిదండ్రులు తమ కుమార్తెల ఆరోగ్య భద్రత కోసం వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగించుకుని టీకాను వేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ దివ్య, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి డా.సంఘమిత్ర, హెల్త్ సూపర్‌వైజర్ పుష్పకుమారి, ఉపాధ్యాయులు రజిత, సుజాత, ఆరోగ్య కార్యకర్తలు ఫాతిమా, స్వర్ణలత, రమణమ్మ, మోతిలాల్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.