కార్యకర్తల ఆశలు.. ఎమ్మెల్యేల కాలయాపన!
పీఏసీఎస్ నామినేటెడ్ పదవుల్లో జాప్యం
తీవ్ర నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు
రంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో చెమటోడ్చి, రూ.లక్షలు ఖర్చు చేసి పార్టీ విజయం కోసం పనిచేసిన ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(Primary Agricultural Cooperative Credit Society) నామినేటెడ్ పదవుల భర్తీ లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంపై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో ఉన్నా.. అందని పదవులు....
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల కాలపరిమితితో, నామి నేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయి ఖర్చు లేని ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు స్థానిక నేతలు సిద్ధమ య్యారు. కానీ, ఎమ్మెల్యేలు మరి యు నియోజకవర్గ ఇన్చార్జిల అ శ్రద్ధ వల్ల ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
ఒక్క షాద్నగర్ లోనే నామినేటెడ్ భర్తీ
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవేళ్ల, కల్వకుర్తి, షాద్నగర్ పరిధిలో మొత్తం 37 పీఏసీఎస్లు ఉన్నా యి. ఒక్క షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో 5 సంఘాలకు పాలకవర్గాలు ఖరారయ్యాయి. మిగతా నియోజకవర్గా ల్లో నాయకులు ఆశావహుల జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలోనూ.. బీఆర్‌ఎస్ హవా....
ఎమ్మెల్యేల ఆలస్యం వల్ల పాత బీఆర్‌ఎస్ పాలకవర్గాలే నేటికీ పదవుల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎరువులు, వి త్తనాలు, రుణాల పంపిణీ వ్యవహారాల్లో ఇ ప్పటికీ బీఆర్‌ఎస్ నేతలదే పైచేయి కావడం స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
* జాబితాలు రాగానే భర్తీ డిసీఓ సుధాకర్.....
కేవలం షాద్నగర్కు చెందిన ఐదు పీఏసీఎస్లకు మాత్రమే నియామకాలు పూర్తయ్యా యని, మిగిలిన చోట్ల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాల్సి ఉందని జిల్లా సహకార అధికారి (డిసీఓ) సుధాకర్ తెలిపారు. ఎమ్మెల్యే లు ఇకనైనా కాలయాపన స్వస్తి చెప్పి, వెంటనే నియామక జాబితాలను పం పి కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలని స్థానిక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.