మేం అసెంబ్లీ నుంచి పోలేదు.. నువ్వే పంపించావు: హరీశ్‌ రావు

16-09-2026 | 06:29pm

హైదరాబాద్‌: అసెంబ్లీ నుంచి తాము వెళ్లిపోలేదని,ప్రభుత్వం పథకం ప్రకారం తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు ఆరోపించారు.“మేం అసెంబ్లీ నుంచి పోలేదు..పథకం ప్రకారం నువ్వే పంపించావు.సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసింది నువ్వే కదా. ఒక సెషన్‌ కాదు.. మొత్తం సెషన్‌ సస్పెండ్‌ చేశారు” అని హరీశ్‌ రావు అన్నారు.తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ కూడా కోరిందని ఆయన పేర్కొన్నారు. “మేం సభలో ఉండాలనుకుంటే.. సస్పెన్షన్‌ ఎందుకు ఎత్తివేయలేదు?” అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నందుకే తమపై బురద రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌ రావు విమర్శించారు. “ఎంతకాలం ఈ అబద్ధాలు చెబుతారు?” అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు