రాజ్యసభ బరిలో దినేష్ ఆర్య.. నామినేషన్ దాఖలు

06-10-2026 | 01:18pm

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభ స్థానానికి బీజేపీ(BJP) అభ్యర్థిగా దినేష్ ఆర్య మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(CM Pushkar Singh Dhami) పార్టీ నేతలు, తన బృందంతో కలిసి హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా సీఎం ధామి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పార్టీ అవసరాలను బట్టి ఏ బాధ్యతనైనా కార్యకర్తలకు అప్పగించగలమని ఆయన అన్నారు. దినేష్ ఆర్య నామినేషన్(Dinesh Arya Nomination) కార్యక్రమంతో రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల(Rajya Sabha Election)పై ఆసక్తి మరింత పెరిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, నైనిటాల్ ప్రాంతానికి చెందిన సీనియర్ దళిత నాయకుడైన ఆర్య సోమవారమే డెహ్రాడూన్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు