అథ్లెటిక్స్ మీట్ లో పతకాలు సాధించిన విద్యార్థులు...

06-10-2026 | 03:06pm
  1. నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్,సబ్ జూనియర్ 
  2. అభినందిన ప్రిన్సిపాల్ సీజ్జు ఎస్ నాయర్

సుల్తానాబాద్, అక్టోబర్ 06 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) మైదానంలో గత మూడు రోజుల క్రితం  నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్,సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు, ఇందులో స్థానిక  కేరళ మోడల్ హై స్కూల్(Kerala Model High School ) విద్యార్థులు.. అండర్ -16 బాలబాలికల విభాగంలో వి. అశ్వద్ బంగారు,రజతం పతకాలు, ఎ వైశాలి బంగారు,రెండు రజతాలు,కాంస్యం , పి. అభిరామ్ రజతం, ఎ.గాయత్రి రజతం,

రిషివర్ధన్ కాంస్యం, అండర్ -14 విభాగంలో ట్రైథలాన్ - ఎ లో కె. శ్రీఛరన్ బంగారు, వి.అవంతిక  కాంస్య పతకం,ట్రైథలాన్- సి లో జి.చరిత బంగారు పతకం, అండర్ -12 విభాగంలో ఆదిల్ కృష్ణ ఎస్ నాయర్ బంగారు పతకం, వి. నిహాస్  గౌడ్ రెండు బంగారు పతకాలు,అండర్ -10 విభాగంలో  యు. హార్ధిక్ బంగారు మరియు రజతం, ఏం. వేదాన్షీ కాంస్య పతకాలు సాధించారు. సబ్ జూనియర్ లో  గెలిచినవారు,

ఈ నెల 11 న ఆసిఫాబాదు లో తెలంగాణ  రాష్ట్ర స్థాయిలో , మరియు అండర్ 14,16 గెలిచినవారు నవంబర్ 13,14,15, 16 హైదరాబాదు లో జరిగే నేషనల్ ఇంటర్  డ్రిస్టిక్ అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొంటారని పెద్దపల్లి అథ్లెటిక్స్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీ కె. గట్టయ్య మంగళవారం తెలిపారు.వీరిని కేరళ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్  సీజ్జు  ఎస్ నాయర్, వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్, పిటీలు ఏ. అజయ్, డి. రాజు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ‎

మరిన్ని వార్తలు