నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ..
24-09-2026 | 05:19pm
అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాధాన్ని స్వీకరించిన భక్తులు
పాపన్నపేట,సెప్టెంబర్24: మండల కేంద్రం పాపన్నపేటలోని నెహ్రూ విగ్రహం వద్ద నవయువ సేవా సంఘం(Navayuva Seva Sangham) ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుడి మండపంలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మండపంలో కొలువు దీరిన గణపయ్యకు అర్చకులు దిగంబర శర్మ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మదిరే సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సంఘం సభ్యులు విక్రమ్ రాజు, లడ్డు, టప్ప కృష్ణ, వంజరి రాజ్ కుమార్, విట్ట శ్రీనివాస్, రాజేష్, శివశంకర్, పృథ్వీరాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.