తాడువాయిలో మట్టి గణపతుల పంపిణీ
10-09-2026 | 07:30pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం తాడ్వాయి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangha) అధ్యక్షులు పాత భాస్కర్ మాట్లాడుతూ.... ప్రతి ఇంటిలో మట్టి గణపతిని(clay Ganeshas) పూజించాలని కోరారు. మట్టి గణపతితో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు.ప్రతి ఒకరు మట్టి గణపతినే ప్రతిష్టించుకోవాలని ఆయన సూచించారు. సంతాయిపేట గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశం గుప్తా చేతుల మీదుగా గణపతులను పంపిణీ చేశారు. తొమ్మిది రోజులు గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని మట్టి గణపతులకు పూజలు నిర్వహించాలని కోరారు.