ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 'కంటి' అద్దాల పంపిణీ

16-09-2026 | 07:56pm

పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్, పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా పాల్వంచ ప్రభుత్వ పాఠశాలల(Palvancha Government Schools)లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బుధవారం  కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం(Distribution of eyeglasses) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత పాల్వంచలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం తరఫున ముఖ్యఅతిథిగా చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ టి.రామారావు పాల్గొన్నారు.

గత నెలలో '14' ప్రభుత్వ పాఠశాలలలో నవ లిమిటెడ్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల, కంటి వైద్య శిబిరం(Eye medical camp)లో 1400 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 170 మందికి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారికి 'కంటి' అద్దాల పంపిణీ చేయడం జరిగింది. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి , ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 'నవ లిమిటెడ్' చేస్తున్న కృషిని అభినందించారు. 

మరిన్ని వార్తలు