విద్యార్థులకు షూ పంపిణీ
24-09-2026 | 06:11pm
సదాశివనగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : మండలంలోని మర్కల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలకు(Zilla Parishad School) సిందే సెహేంద్రనాథ్ వారి సహకారంతో,భారతి శ్రీవారి SCS చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి భారతి 150 విద్యార్థులకు సుమారు 40000/రూపాయల విలువ గల షూలను విద్యార్థులకు అందజేశారు.
భారతికి పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ ప్రసాద్, సహేందర్ నాథ్, వెంకటి, రాజయ్య, నాగరాజు, శ్రీనివాస,శివప్రసాద్, ఆస్మా, స్వర్ణలత పాల్గొన్నారు.