జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్

17-09-2026 | 01:27pm

జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు 

కొత్తగూడెంటౌన్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి,జిల్లా పరిషత్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు