బోధన్‌లో డీఎంహెచ్‌ఓపై స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల దురుసు ప్రవర్తన

10-09-2026 | 04:36pm

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రాజశ్రీ పలు స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా సెంటర్ నిర్వాహకులు, ఓ వైద్యుడు విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. స్కానింగ్ సెంటర్‌లో కనీస సౌకర్యాలు, అవసరమైన రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణపై సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, వివరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తనిఖీల సమయంలో స్కానింగ్ సెంటర్‌లోని ఓ నిర్వాహకుడి భర్త దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ వెల్లడించారు. వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ స్కానింగ్ సెంటర్ పైన కలెక్టర్ కు ఫిర్యాదు   చేసి ఎఫైర్ అయ్యే విధంగా చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు